ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది హోస్ట్ శ్రీముఖి. ఇండస్ట్రీలో ఉన్న ఒక తెలుగింటి అమ్మాయికి పెళ్ళైతే చూసి హ్యాపీగా ఉండేవారిలో చాలా మంది ఉన్నారు. ఐతే తనకు పెళ్లి చేసేసుకోవాలని ఎక్కువ కోరికగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి త్వరలో జరగబోతోందన్న విషయాన్నీ కూడా చెప్పింది. ఎనర్జీ సేవింగ్ తో పాటు ఏజ్ సేవింగ్ కూడా చేస్తున్నారా ఎలా ? అని తేజస్విని మడివాడ అడిగేసరికి శ్రీముఖి ఇలా చెప్పింది
" రోజూ ఒక్క మీల్ మాత్రమే తింటాను. అది కూడా ఫుల్ ప్రోటీన్ మీల్. ఈ ప్రొఫెషన్ కోసం చాలా ఇష్టమైన ఫుడ్ ని సాక్రిఫైస్ చేశా. నేను పదో తరగతిలో ఉండేటప్పుడు 108 కేజీలు ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా మారిపోయాయి పూర్తిగా ప్రొఫెషన్ కోసం. దేవుడు ఏదైనా ఇవ్వాలంటే కస్టాలు పెట్టి మరీ ఇస్తాడు. అలాగే నేను ఎంతో కష్టపడుతూనే ఉంటాను. నన్ను నేను ప్రేమించుకుంటాను. నేను షోలో కనిపించే విధానం కానీ నేను వేరే వాళ్ళను ఇన్స్పైర్ చేసే విధానం అన్నిటిని ప్రేమిస్తాను. ఇక నాకు రాబోయే అబ్బాయి నన్ను బీటౌట్ చేసేలా ఉండాలి. నాతో పోటీ పడాలి. నేను ఒక విషయాన్నీ మార్చుకోవాలి అనుకుంటున్నా..నేను ఎప్పుడూ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాను. కానీ దాని వలన నాకు వేల్యూ లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. సో ఇవ్వడం అనేదాన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నా " అని చెప్పింది శ్రీముఖి.